యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దు
హుజురాబాద్ ఏసీపీ మాధవి
హుజురాబాద్,జూన్22: (విజయ క్రాంతి) యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దని హుజురాబాద్ ఏసిపి మాధవి అన్నారు. సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మత్తు పదార్థాల అవ గాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.... ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తారని వారి ఆశయాలకు అనుగుణంగా చదివి ప్రయోజకులు కావాలని అన్నారు.
మత్తు పదార్థాల వాడకం వల్ల సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని,ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఒక గొప్ప ఆశయాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగు ణంగా చదవాలని అన్నారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు చదువుకునే విద్యాసంస్థల వద్ద పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు వాడకం కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు . మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉంటే వృద్ధిలోకి వస్తారని తెలిపారు . ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్ తో పాటు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.






