18-08-2025 02:03:30 AM
న్యూయార్క్, ఆగస్టు 17: న్యూయార్క్ పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున 3.30 ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్టు న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి 36 షెల్ కేసింగ్స్ (తూటాల పైని భాగం), ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. చనిపోయిన ముగ్గురిలో ఇద్దరిని 27 సంవత్సరాలు, 35 సంవత్సరాల వ్యక్తులుగా గుర్తించారు. కాల్పులు జరిగిన టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్‌ను 2022లో ప్రారంభించారు. అది అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం.