18-08-2025 02:05:48 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 17: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముగ్గురూ ఈ నెల 22న భేటీ కానున్నట్టు సమాచారం. ఆగస్టు 22న త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అవనున్నారు.
వీరి సమావేశం తర్వాత ఈ విషయం గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జెలెన్‌స్కీతో పాటు ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, మరింత మంది నేతలు ట్రంప్‌తో భేటీ అవుతారని సమాచారం. ఈ త్రైపాక్షిక సమావేశం ఎక్కడ అనే వివరాలు తెలియదు.