05-07-2025 02:11:00 AM
పాక్‌కు చైనా, తుర్కియే మద్దతిచ్చాయి
న్యూఢిల్లీ, జూలై 4: పాకిస్థాన్ బంధంపై భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో దా యాది దేశానికి చైనా, తుర్కియే బయటి నుం చి మద్దతు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌కు రాహుల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ సాంకేతికత, నిఘా ఆధారంగా చాలా డేటా సేకరించాం. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించాం. వాటిలో తొమ్మిదింటిని టార్గెట్ చేయడం సరైందని భావించాం. దా యాదికి చెందిన 81 శాతం మిలిటరీ హార్డ్‌వేర్ చైనాకు చెందినవే. తుర్కియే కూడా దాయాది కి మద్దతు అందించింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత నాలుగు రోజుల పాటు భారత్, పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో డీజీఎంఒ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు.. భారత్ దాడికి అనుసరిస్తున్న పద్దతులు, ఎత్తుగడల సమాచారం ఎప్పటికప్పుడు బీజింగ్ నుంచి ఇస్లామాబాద్‌కు చేరింది’ అని రాహుల్ పేర్కొన్నారు.