16-11-2025 12:33:32 AM
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తుంగతుర్తి, నవంబర్ 15(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రం లో జనగామ--- -సూర్యాపేట జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు.. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో జనగాం నుంచి సూర్యాపేట కు వెళ్తున్న ఒక గుర్తుతెలియని కారు నాగారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కమలాకర్‌తో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరిని ఢీకొంది.
దీంతో కానిస్టేబుల్‌కు, మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. బాధితులను సూర్యాపేట జనరల్ హాస్పటల్‌కి తరలించారు. కమలాకర్ పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.