11-12-2025 12:37:43 AM
ఉప్పల్ డిసెంబర్ 10విజయక్రాంతి : తమ శ్రమకు తగ్గ జీతం ఇవ్వాలంటూ గత మూడు రోజులుగా షాహి ఎక్సపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహిళా కార్మికులు గల మెత్తారు. రాజకీయ నాయకులు సామాజిక వేతలు కార్మికులకు మద్దతు తెలుపుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ప్రభాకర్ కార్మికులకు న్యాయం జరగాలంటూ ధర్నా చేయడంతో పాటు అర్ధరాత్రి గేటు ముందే నిద్రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు న్యాయం జరిగే వరకూ అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పది సంవత్సరాల నుండి 10000 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళ శ్రమ దోపిడి కి పాల్పడుతున్న షాహి కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 2000 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని నెలలు రెండు సెలవులు ఉంటాయని.
ఇవి కాకుండా సెలవులు ఉపయోగించుకుంటే జీతాలు కట్ చేసి ఎక్కువ పని గంటలు చేయించుకుంటు మానసికంగా ఇబ్బంది గురి చేస్తు వారి కష్టాన్ని దోచుకోవడం సిగ్గుచేటు అన్నారు. కనీసం ఈ ఎస్ ఐ పి ఎఫ్ సౌకర్యాలు ఇవ్వకుండా కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కిన అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దాడులు సైతం కంపెనీ సూపర్వైజర్లు చేయడం అనుమానిషమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి షాహి కంపెనీ యజమాని పై చర్యలు తీసుకొని కార్మికులు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.