calender_icon.png 12 May, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జెండాకు సెల్యూట్ చేసి పులి వేషధారులు

16-07-2024 03:40:19 PM

జగిత్యాల: మొహర్రం పండుగ పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రమైన జగిత్యాలలో మంగళవారం కొందరు పులి వేషాలు వేశారు. దీంతో తమ దేశభక్తిని చాటుకొన్నారు. జగిత్యాలలో నిత్య జనగణమన పలు కూడళ్ళలో జాతీయ జెండాలు ఏర్పాటు చేసి ఉదయం సామూహిక జనగనమన గీతాన్ని ఆలపిస్తారు. మొహరం పండుగను పురస్కరించుకొని పులి వేషాలు వేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇవాళ ఉదయం జనగణమన గీతం వస్తున్న సమయంలో అదే దారి గుండా వెళ్తున్న పులి వేషధారులు అక్కడే నిలుచుండి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. వారు నిత్య జనగణమనలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పులి వేషదారులు జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ దేశభక్తిని చాటుకోవడంతో పట్టణ ప్రజలు అభినందించారు.