calender_icon.png 14 May, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం

16-07-2024 03:29:38 PM

పెద్దపల్లి : మంథని మండలంలోని గుంజపడుగు గ్రామాని చెందిన దొడ్డిపట్ల మహేష్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న అదే గ్రామాని చెందిన ప్రముఖ ఫార్మ వ్యాపారవేత్త సుంకు రామచందర్ స్పందించి  రూ. 10 వేలు ఆర్థిక సహాయం కింద పంపించారు. రాంచందర్ చిన్ననాటి మిత్రులైన సదాశివ, రాజశేఖర్, పంచాక్షరి, కుమార్ లు అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్  కు డబ్బులను మంగళవారం అందజేశారు. తనకు ఆర్థిక సహాయం చేసిన రామచందర్ కు మహేష్ కృతజ్ఞతలు తెలుపగా, గ్రామస్తులు రామచందర్ కు  అభినందనలు తెలిపారు.