27-11-2025 12:00:00 AM
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, నవంబర్ 26 (విజయ క్రాంతి): జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా పరిధిలో 566 గ్రామ పంచాయతీ సర్పంచ్, 566 ఉప సర్పంచ్, 5168 వార్డు సభ్యుల ఎన్నిక 3 విడతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపా రు.
మొదటి విడత డిసెంబర్ 11న 7 మండలాల్లోని 192 గ్రామాలు, 1740 వార్డులకు, రెండవ విడత డిసెంబర్ 14న 6 మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడవ విడత డిసెంబర్ 17న 7 మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పోలింగ్, కౌంటింగ్ ఒకే రోజు జరుగుతాయని, ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
మొదటి విడత పంచాయతీలకు నవంబర్ 27న, రెండవ విడత పంచాయతీలకు నవంబర్ 30న, మూడవ విడత పంచాయతీలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయ డం జరుగుతుందని అన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లకు, తర్వాతి రోజు నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన నామినేషన్ల ప్ర కటన ఉంటుందని, మరుసటి రోజు అప్పీళ్లను స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని అ న్నారు.
నామినేషన్ల ఉపసంహరణ మొద టి విడత పంచాయతీలకు డిసెంబర్ 3, రెండవ విడత పంచాయతీలకు డిసెంబర్ 6, మూడవ విడత పంచాయతీలకు డిసెంబర్ 9 మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఉంటుందని, అదే రోజున పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ ఖరారు చేసామని అన్నారు.
గ్రామపంచాయతీ స ర్పంచ్ పదవి కోసం 166 ఎస్టి (మహిళలు 75, జనరల్ 91), 110 ఎస్సీ (మహిళలు 48, జనరల్ 62), 54 బీసి (మహిళలు 24, జనరల్ 30), 236 అన్ రిజరవ్డ్ క్యాటగిరి (మహిళలు 112, జనరల్ 124) లుగా రిజర్వేషన్ కేటాయించడం జరిగిందని అన్నారు.
ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 7 లక్షల 95 వేల 138 మంది ప్రజ లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటా రని, 708 పోలింగ్ లొకేషన్ లలో 5168 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, సర్పంచ్ ఎన్నికలకు 9 లక్షల 51 వేలు, వార్డు సభ్యుల ఎన్నికలకు 9 లక్షల 51 వేల బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశామని, 4894 జంబో, 852 మీడియం బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 566 రిటర్నింగ్ అధికారులు, 3442 పోలింగ్ అధికా రులు, 4217 ఇతర పోలింగ్ అధికారులు, 15 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,15 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు, 76 జోనల్ అధికారులు, 25 టిఓటీ, 241 రూట్ అధికారులు నియమించామని, 20 డిస్ట్రిబ్యూషన్ సెంట ర్ లు, 191 రిసెప్షన్ కేంద్రాలను, 566 కౌం టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో గుర్తించిన 1858 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశామని, 648 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు నమోదు చేయాలనుకునే వారు 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఎంసిసి కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల ప్రచార ఖర్చులను నమోదు చేసేందుకు ధరల లిస్టు సిద్ధం చేశామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వీడియోలు వినియోగించాలంటే ముందుగా ఎం.సి.ఎం.సి. అనుమతి తీసుకోవాలని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.