27-11-2025 12:00:00 AM
కరీంనగర్, నవంబరు 26 (విజయ క్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్.సి. సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్ హాజరై పలువురు నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.
అనంతరం నగర కాంగ్రెస్ ఎస్.సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో నగరంలోని కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 26 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అంకితం చేసి అమలు చేసిన రోజని, జాతీయ న్యాయ దినోత్సవమని తెలిపారు. ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్రుత్వంతో పాటు దేశ ప్రజలకు హక్కులు కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని అంబేద్కర్ ప్రవేశపెట్టారన్నారు.
అంతటి మేధావి భారతదేశంలో పుట్టడం పట్ల మనమంతా గర్వపడాలని, భవిష్యత్ తరాలకు భారత రాజ్యాంగ విలువలను దాని గొప్పదనాన్ని చాటి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాలలో నాయకులు ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, సిరాజ్ హుస్సేన్, శ్రావణ్ నాయక్, వెన్నం రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కర్ర రాజశేఖర్, కలువల రామచందర్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, ఆకుల ప్రకాష్, నిహాల్, వసీం, ఆకుల నరసయ్య, కోటగిరి భూమా గౌడ్, దన్నసింగ్, ఇమ్రాన్, బాసెట్టి కిషన్, రోళ్ళసతీష్, శ్రీరాముల కిషన్, సోహెల్, జీడి రమేష్, బత్తుల రాజకుమార్, గాలి అనిల్ కుమార్, రాచర్ల పద్మ, సాయికృష్ణ, మంద మహేష్, ఈశ్వరి, దీకొండ శేఖర్,బషీర్, సరిల్లా రతన్ రాజు, తంగేళ్ల కిరణ్,కలీం,దండి రవి, శివప్రసాద్, మహమ్మద్ గౌస్ పాషా, అక్బర్, తదితరులుపాల్గొన్నారు.