calender_icon.png 4 December, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర సర్వేకు సహకరించాలి

10-11-2024 01:19:43 AM

సంగారెడ్డిలో ఎన్యుమరేటర్లకు సర్వే పత్రాలను అందజేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ 

సంగారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించి, వివరాలు తెలియజేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మం త్రి దామోదర రాజనర్సింహ కోరారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో సర్వేను ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ఎలాంటి అపోహ పడకుండా ఎన్యుమరేటర్లకు సమాచారం అందించాలని అన్నారు. సర్వేలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.