11-01-2026 12:22:11 AM
భీమదేవరపల్లి, జనవరి 10 (విజయక్రాంతి): కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవా ల్లో వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం శనివారం రాత్రి అత్యం త కమనీయంగా జరిగింది. కొత్తకొండ వీరభద్రుడు ఆలయం నుంచి వీరభద్ర స్వామి వారి ని పెళ్లి కొడుకుగా భద్రకాళి అమ్మవారిని పెళ్లికూతురుగా తీర్చిదిద్ది ఆలయంలోని వేద పం డితుల మంత్రోచ్ఛారణ మధ్య ధ్యాన మండ పం వద్దకు తీసుకువచ్చి పెళ్లి వేడుకలను జరిపించారు.
వీరభద్రుడికి భద్రకాళి అమ్మవార్లకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామా ల సునీత, మాజీ ఎంపీపీ బొజ్జపురి అశోక్ ముఖర్జీ లు పట్టు వస్త్రాలు సమర్పించారు. పెళ్లి వేడుకలను ఆలయ అర్చకులు వినయ్ శర్మ కే. రాజయ్య మొగిలిపాలెం రాంబాబు శివకుమా ర్ శర్మ జరిపించారు. వేడుకల్లో మాజీ చైర్మన్లు కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా, ఆర్ వెంకట్‌రెడ్డి, చిట్టంపల్లి ఐలయ్య, పూస కోయిల ప్రకాష్, పిడిశెట్టి కనుకయ్య పాల్గొన్నారు.