29-09-2025 01:30:11 AM
కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హైటె క్స్‌లో మంగళవారం ‘మేరా దేశ్ పహలే-ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ జీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొని మాట్లాడారు.
దేశాభివృద్ధిలో ముందుండే విధంగా ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఆవిష్కరణాత్మక నిర్ణయాలను, వారి నాయకత్వంలోని అనేక ప్రయోజకరమైన కార్యక్రమాలను వివరిస్తూ ఈ వేడుక ద్వారా యువత కు స్ఫూర్తికలగాలని ఆకాంక్షించారు. దీనికంటే ముందు ప్రధాని మన్ కీబాత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, తద్వారా స్వదేశీ వ్యాపారస్తులకు మేలు కలుగుతుందన్నారు. ఇదిలా ఉంటే మేరా దేశ్ పహలే కార్యక్రమం ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.