calender_icon.png 4 May, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ ఫొటోకు క్షీరాభిషేకం

03-05-2025 12:00:00 AM

కులగణన నిర్ణయంపై బీజేపీ కార్యకర్తల సంబురాలు

హుస్నాబాద్, మే 2 : కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించాలని నిర్ణయించడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని సతీశ్ మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా జనాభా లెక్కలు తీయలేదని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం తప్పుల తడకగా సర్వే నిర్వహించి ముస్లింలను బీసీల్లో కలిపిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని మోడీ కులగణన నిర్ణయం తీసుకుంటే, అది తమ పార్టీ వల్లనే జరిగిందని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని  మండిపడ్డారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ బాబు మాట్లాడుతూ, జనగణన, కులగణన కోసం కేంద్ర కేబినెట్ ద్వారా చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని కొనియాడారు.

అభివృద్ధి ఫలాలు అట్టడుగు పేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు భూక్య సంపత్, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాయికుంట చందు, తగరం లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు రాంప్రసాద్, వడేపల్లి లక్ష్మయ్య, చెన్నబోయిన రవీందర్, కార్యదర్శి వేల్పుల నాగార్జున,

భూషాంకర్, నారోజు నరేశ్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయికృష్ణ, సీనియర్ నాయకులు బోనగిరి రవీందర్, వెలదండి సంతోష్, పోలోజు రవీందర్, ఎర్రబెల్లి ప్రశాంత్, బాలరాజు, అరుణ్, సందీప్, మల్లేష్, రాజశేఖర్, కుమార్, కన్నె, శంకర్, సుధాకర్ పాల్గొన్నారు.