calender_icon.png 15 May, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి

17-12-2024 02:33:38 AM

శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): లగచర్ల కేసులో అరెస్టున రైతులపై కేసులు ఎత్తివేసి, వెంటనే ప్రభుత్వం వారిని విడిపించాలని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. శాసనమండలిలో సోమవారం ఆయన ప్రసంగిస్తూ.. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్ రాకుండా ప్రభుత్వమే కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకునేలా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోవాలని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు.