07-05-2025 12:00:00 AM
నిజామాబాద్ మే 6: (విజయ క్రాంతి): నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన ఏసీపీ నారాయణ ను డిజిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో ట్రాఫిక్ పోలీసు లలో కల కాలం మొదలైంది. ఏసిపితోపాటు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న వారిపై కూడా అధికారులు దృష్టి సారించారు. నిజామాబాద్ ట్రాఫిక్ విభాగం కొత్త ఏసిపి గా నగరంలో ఉన్న మస్తాన్ అలిగి బాధ్యతలు అప్పగించారు.
నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో ఏసీపీ నారాయణ బదిలీ అంశం చర్చనీ అంశమైంది ఏసీబీ నారాయణ పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. టాపిక్ విభాగంలో మహిళ కానిస్టేబుల్ చేసిన మరో ఫిర్యాదు ను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ భాగంలో ఉన్న ఏసీపి పై సొంత డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు నివేదించారు. పై ఆరోపణల కారణంగా ఏసీపీ నారాయణను డిజిపి కార్యాలయానికి అటాచ్ చేశారు.