15-10-2025 12:09:21 AM
సుల్తానాబాద్, అక్టోబర్14 (విజయ క్రాంతి) : ఉమ్మడి జిల్లాస్థాయి చదరంగ పోటీలలో ఎంపికైన సుల్తానాబాద్ సెయింట్ మేరీస్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని దాసోహం ఆరాధ్య. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 11న జరిగినటువంటి ఎస్ జి ఎఫ్ అండర్ 14, అండర్ 17 చదరంగ పోటీలలో జిల్లాలోని పలు మండలాల విద్యార్థిని, విద్యా ర్థులు పాల్గొనగా అండర్ 14 విభాగంలో ప్రతిభ కనబరిచి రెండవ స్థానంలో సిల్వర్ మెడల్ పొంది, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనందుకు విద్యార్థిని ఆరాధ్య ను పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కాసు షో రెడ్డి మంగళవారం అభినందించారు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యా ర్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని, చదరంగం క్రీడతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, పట్టుదల పెరిగి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారని అన్నారు.