09-10-2025 12:00:00 AM
-కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, అక్టోబర్ ౮ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మీడియా సహక రించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల మీడియా సెల్ ప్రారంభించారు. రాజకీయ పార్టీ నాయకుల వార్తలపై ప్రతిరోజు పరిశీలన ఉంటుందని ప్రచారులపై నిఘా టీం పని చేస్తుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం హెల్ప్‌లైన్ కేంద్రా న్ని పరిశీలించిన కలెక్టర్ రికార్డు గదులను పరిశీలించి రెవెన్యూ అధికారులకు సూచన లు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ పైజాన్ అహ్మద్ పిఆర్ ఓ విష్ణువర్ధన్ డిఆర్‌ఓ రత్నా కళ్యాణి డివైస్ ఓ శ్రీకాంత్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.