calender_icon.png 12 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళను హత్యచేసిన నిందితుడి రిమాండ్

09-10-2025 12:00:00 AM

డీఎస్‌పీ నల్లపు లింగయ్య

మక్తల్, అక్టోబర్ 8 ః మహిళ హత్య కేసులో నిందితుడు కృష్ణారెడ్డిని నాలుగు రోజుల్లోనే పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు డి.ఎస్.పి నల్లపు లింగయ్య తెలిపారు. బుధవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో సిఐ రామ్ లాల్, ఎస్త్స్ర భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రములోని కర్నూలు పట్టణానికి చెందిన కృష్ణారెడ్డి తో మక్తల్ మండలం సత్వార్ గ్రామానికి చెందిన వినోదుకు 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది,

వీరి వివాహము జరిగిన తర్వాత ఏడాది కూడా తనతో భార్య కాపురం చేయలేదని భార్య పుట్టింటి వద్దనే ఉంటుందని తరచూ ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుండదని పలుమార్లు ఇద్దరు మధ్య గొడవలు జరిగిందని. అత్తగారి ఇంటికి దసరా పండుగకు వచ్చి తన భార్యను ఒంటరిగా ఉన్న సమయంలో గొడవపడి పొలం వద్ద కత్తితో పొడిచినట్లు నిందితుడు కృష్ణారెడ్డి ఒప్పుకున్నాడని డిఎస్పి తెలిపారు. నిందితుడు పై హైదరాబాదులోని కుసాయిగూడ పోలీస్ స్టేషన్లో గాంజాయి, హత్య కేసులు ఉన్నట్లు వారు తెలిపారు.

సత్వార్ గ్రామానికి చెందిన తిప్పమ్మ కూతురు వినోదును అల్లుడు దారుణంగా హత్య చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం సర్చ్ చేస్తుండగా స్వస్థలమైన కర్నూలుకి స్కూటీ పై వెళుతుండగా బూత్పూరు హైవేపై పట్టుకొని విచారించారు.  పోలీసులు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దీంతో నిందితుడిని రిమాండ్ పంపినట్లు డి.ఎస్.పి తెలిపారు .యొక్క కేసు చేదించడానికి సహకరించిన ఎస్‌ఐలకు పోలీసులకు ప్రభుత్వం ద్వారా రివార్డులో అంది విధముగా చూస్తానని డిఎస్పితెలిపారు.