26-10-2025 12:38:43 AM
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 25(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన సంఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా, పెద్ద అం బర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన బోల్తా పడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ 39యూపీ1963 న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 9 మందితో మియాపూర్ నుంచి గుంటూరు బయలుదేరింది. మార్గమధ్యలో పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ వద్ద కిందికి దిగుతున్న క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణికుల్లో ఆరుగురు తీవ్రగాయాలు కాగా కొందరు స్వల్పం గా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్సులో హయత్‌నగర్‌లోని సన్‌రైస్ దవాఖా నకు తరలించారు.
హయత్‌నగర్ సన్‌రైస్ దవాఖానలో చికిత్స పొందుతున్న వారు గుంటూరుకి చెందిన షేక్ జహీర్ (20), అకుల గాయత్రి (23), కాస్తిక్ సుభాష్, మరో నలుగురు మౌనిక (26) ఓసీసీ అధికారి గుంటూరు, ప్రత్యూష (26) ఓసీసీ అధికారి గుంటూరు, వేరా ఆంజనేయరెడ్డి (63) ఓసీసీ డ్రైవర్, శ్రీనువాస్, వయసు 35, ఓసీసీ అధికారి ప్రత్యామ్నాయ డ్రైవర్లు కంచన్‌బాగ్ డీఆర్‌డీవో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై రెండు కేసులు నమోదైనట్లు తెలిసింది. ప్రమాద ఘటన కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి తెలిపారు.