28-01-2026 12:24:15 AM
ఎల్బీనగర్, జనవరి 27: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నైకోటి రాజు డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నైకోటి రాజు మాట్లాడుతూ...
సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే డీలర్లతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు కోకొండ వైకుంఠం గుప్తా మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలో రేషన్ డీలర్ ఏ కారణంతోనైనా మృతి చెందితే తనవంతు సాయంగా రూ.21వేలు ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు చేసిన డిమాండ్ల సాధనకు కృషి చేస్తానన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆవుల సంజీవ రెడ్డి, కోశాధికారి పారేపల్లి నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మల్లికార్జున్ గౌడ్, రాష్ట్ర నాయకులు నందయ్య, ఇంద్రసేనారెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, మురళీ మోహన్, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడ శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాల్గొన్నారు.