16-10-2025 02:50:14 AM
నివాళి అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్, కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మేఘా ఇంజినీరింగ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి మాతృమూర్తి, స్వర్గీయ పురిటిపాటి విజయలక్ష్మికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు నివాళి అర్పించారు. ఈ నెల 5న తుదిశ్వాస విడిచిన విజయలక్ష్మి సంస్మరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి హాజరై పుష్పాంజలి ఘటించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కార్యక్రమం ప్రారంభంలో, విజయలక్ష్మి భర్త పీ వీరారెడ్డి, కుమారులు ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, సీఈవో పీవీ సుబ్బారెడ్డి, కుమార్తె ప్రసన్న, సోదరుడు, ఎంఈఐఎల్ చైర్మన్ పీపీ రెడ్డితోపాటు ఇతర కుటుంబసభ్యులు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సంస్మరణ సభకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, భూపతిరాజు, బండి సంజయ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీలు సీఎం రమేశ్, కే రఘువీర్‌రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, నిర్మాత దగ్గుబాటి సురేశ్, మాజీ ఎంపీలు కేవీపీ, మధుయాష్కీగౌడ్, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ హాజరయ్యారు.