calender_icon.png 6 December, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు

06-12-2025 10:47:53 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం కూడా చైర్మన్, హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు  లు హనుమకొండ డిసిసి భవన్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అంబేద్కర్ సర్కిల్ లో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత పోరాటం ప్రతి పౌరుడికి మార్గదర్శకమని, ఆయన రచించిన రాజ్యాంగ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను దేశానికి అందించారని, ఈ విలువలు కాపాడడం మనందరి బాధ్యత అని సమాజంలో ప్రతి ఒక్క వర్గం అభివృద్ధి చెందేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, ఆయన చూపిన దారిలో మనమందరం నడిస్తే నిజమైన గౌరవం అని అన్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు విజయశ్రీ రజాలి, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ శ్రేణులు పెరుమండ్ల రామకృష్ణ, మండల సమ్మయ్య, తాళ్లపల్లి సుధాకర్, పలు డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.