29-07-2025 12:00:00 AM
ఆరోగ్యంగానే తల్లి, పిల్లలు
మహబూబాబాద్, జూలై 28 (విజయక్రాంతి): సాధారణంగా ఒక కాన్పులో ఒక్కరు లేదంటే ఇద్దరు జన్మించడం పరిపాటి. అయితే మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విఎస్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గుండెబోయిన కళ్యాణికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు.
మూడు రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో బంధువులు కళ్యాణిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం వైద్యులు కళ్యాణికి ఆపరేషన్ చేసి కాన్పు నిర్వహించగా ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగబిడ్డ జన్మించారు. ముగ్గురు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.