24-07-2024 01:46:49 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య జయంతిని మంగళవారం నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్ గౌరీ శంకర్ పాల్గొని మాట్లాడారు. దాశరథి లాంటి గొప్ప కవి తెలంగాణలో పుట్టడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు. దాశరథి ఆకారంలో వామనుడే అయినా కవిత్వంలో త్రివిక్రముడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వెల్దండ నిత్యానందరావు, సంగనభట్ల నరసయ్య, డా.ఎన్.బాలాచారి, ఆచార్య మానస చెన్నప్ప కే.సరస్వతమ్మ, ఎం దేవేంద్ర, జ్యోతి, పద్మ యాదవ్, మోహన్‌రావు పాల్గొన్నారు.