12 May, 2026 | 1:24 AM

తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం

12-05-2026 12:00 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 

సికింద్రాబాద్, మే 11 (విజయక్రాంతి): ప్రధాని సమావేశానికి సభకు భారీగా ప్రజలు తరలి వచ్చారని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్ అన్నారు. మోదీ సభ విజయవంతమైన సందర్భంగా కంటోన్మెంట్‌లో సో మవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మోర్చాల నాయకులు, డివిజన్ల నాయకులు సహకారంతో సభ విజయవంతం అయ్యిందన్నారు.

ఎక్కువ మంది మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు హాజరయ్యారని చెప్పారు. ఈ మీటింగ్‌తో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డమీద బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమస్యలు తీరాలన్నా, రాష్ర్టం అప్పుల ఊబిలో నుంచి బయటపడాలన్నా, రైతుల, విద్యార్థుల సమస్యలు తీరాలన్న బీజేపీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

మోదీ చెప్పినట్టుగా స్వదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడాలని, విదేశీ మారక ద్రవ్యం ఖర్చు కాకుండా చూడాలని కోరారు. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు నిధులు అడుగుతారని, వెళ్లిన తర్వాత ఏమిచ్చారని విమర్శిస్తారన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నందునే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ఈటల రాజేందర్ అన్నారు.