calender_icon.png 30 September, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం..

30-09-2025 06:49:35 PM

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి..

కార్యకర్తలతో కిటకిటలాడిన టిఆర్ఎస్ కార్యాలయం..

తాండూరు (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయఢంకా మ్రోగించడం ఖాయమని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో పెద్దముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడరాదని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా టిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకుల, కార్యకర్తలతో కార్యాలయం కిటకిటలాడింది. ఇంకా ఈ సమావేశంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.