15-09-2025 12:00:00 AM
- అవసరమైన సదుపాయాలు కల్పించండి
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, సెప్టెంబర్ 14: నమ్మకమే వ్యాపారానికి పెట్టుబడి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని ఓబులాయపల్లి దగ్గర నూతన సిరి ప్యురు వెజ్ రెస్టారెంట్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేష్ తో కలిసి మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోదారుడికి అవసరమైన ఆహారాన్ని నాణ్యతగా అందించాలని, ఎక్కడ రాజీ పడకూడదని సూచించారు. అంచలంచలుగా అభివృద్ధి వైపు ముందుకు సాగాలని సూచించారు. నూతన రెస్టారెంట్ ను ప్రారంభించి అన్వర్ భాయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉమర్, మాజీ కౌన్సిలర్ చిన్న, కాంగ్రెస్ నాయకులు RP వెంకటేష్, మైత్రి యాదయ్య, ఆంజనేయులు, మురళి, సంజీవ్ తదితరులు ఉన్నారు.