6 July, 2026 | 3:02 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

నమ్మకమే వివాహానికి మూలం

08-08-2024 03:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): నమ్మకం, అర్థం చేసుకునే తత్వం అనేవి వివాహానికి మూల స్తంభాలు అని హైకోర్టు అడ్వకేట్ విజేత బొరకటి, ప్రొ.పీ జ్యోతి అన్నారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్‌లో బుధవారం ‘ఉమెన్ ప్రొటెక్షన్ సెల్’, ‘దుర్గా స్రవంతి సంస్థ’, ‘ఆల్ ఇండియా లైనెస్ క్లబ్‘ ఆధ్వర్యంలో కళాశాల డైరెక్టర్, ప్రొ.విజయలక్ష్మి కంతేటి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు.. యువత వివాహానికి సిద్ధమైనపుడు కలిగి ఉండాల్సిన అవగాహన గురించి వివరించారు. భారత న్యాయసంహితలోని వివిధ సెక్షన్ల ఉపయోగాలు, అత్యవసర సమయంలో డయల్ చేయాల్సిన నంబర్ల గురించి తెలిపారు.