calender_icon.png 21 September, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐరోపా ఎయిర్‌పోర్ట్‌లపై సైబర్ దాడులు

21-09-2025 12:52:40 AM

-నిలిచిపోయిన చెక్ బోర్డింగ్ సేవలు

-ఇంగ్లండ్, జర్మనీ, బ్రెజిల్ దేశాల్లోని విమానాశ్రయాలే లక్ష్యం 

బ్రస్సెల్స్, సెప్టెంబర్ 20: ఐరోపా ఖండంలోని పలు  విమానాశ్రయాలు శనివారం సైబర్ దాడులతో అతలాకుతలం అయ్యా యి. సైబర్ దాడులతో విమానాశ్రయాల్లోని చెక్ బోర్డింగ్ సేవలకు తీవ్ర అంతరా యం కలిగింది. లండన్ నగరంలోని హీత్రో, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లో సైబర్ దాడుల వల్ల పలు విమానసర్వీసులకు అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు రద్దయి నట్టు కూడా మీడియా కథనాలు వెల్లడించా యి. విమానాల రద్దుతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న అనేక మందిపై తీవ్రంగా ప్రభా వం పడింది.

విమానాశ్రయాల్లో ఆటోమేటిక్ చెక్ వ్యవస్థ అండ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థ ఉంటుంది. ఈ సైబర్ దాడుల వల్ల ఈ రెండు వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం అయినట్టు విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి, ప్రయాణికులకు  పూర్తి సేవలు అందించనున్నట్టు విమానాశ్రయ వ ర్గాలు ప్రకటించాయి. జర్మనీలోని అతిపెద్ద విమానాశ్రయం అయిన ఫ్రాంక్‌ఫ్రూట్ వి మానాశ్రయం సైబర్ దాడి వల్ల ప్రభావితం కాలేదు. జ్యూరిచ్ విమానాశ్రయంలో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు.