21-09-2025 12:54:28 AM
-భారత్ నుంచి అమెరికా వెళ్లే సర్వీస్‌లకు డిమాండ్
-రూ.37 వేల నుంచి రూ.80 వేల వరకు పెరుగుదల
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ వీసాలపై తీసుకున్న నిర్ణయం విమాన టికెట్ ధరలపైనా పడింది. అగ్రరాజ్యం తీసుకున్న కొత్త నిర్ణయంతో అమెరికా వెళ్లాల్సిన కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పటికే ప్రయాణంలో ఉన్నవారు దుబాయ్ వంటి ట్రాన్సిట్ సెంటర్లలో విమానాల నుం చి దిగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు కొన్ని దిగ్గజ కంపెనీలు దేశం వెలుపల ఉన్న వారిని 24 గంటల్లోపు తిరిగి అమెరికా చేరుకోవాలని ఆదేశించాయి.
అలాగే అమెరికాలో ఉంటున్న ఉద్యో గులు అక్కడే ఉండాలని సూచించాయి. దీం తో ప్రయాణాల విషయంలో గందరగోళం ఏర్పడింది. అత్యవసరంగా అమెరికా వెళ్లేవా రు ఎంత ధరకైనా వెనుకాడకుండా విమాన టెకెట్లు బుక్ చేసుకునేందుకు సిద్ధమయ్యా రు. ఇదే అవకాశంగా భావించిన విమానయాన సంస్థలు, మేక్ మై ట్రిప్ వంటి థర్డ్ పార్టీ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి న్యూ యార్క్ వెళ్లే ఒక వన్-వే టికెట్ ధర కేవలం రెండు గంటల్లోనే రూ.37,000 నుంచి రూ. 80,000 వరకు పెరిగింది.
మేక్ మై ట్రిప్‌తో పాటు ఇతర సంస్థలు అమెరికాకు ఆఖరి నిమిషం వరకు బుకింగ్స్ తెరిచే ఉంచాయి. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్‌కు వచ్చే ఒక ఎమిరేట్స్ వి మానం గంటల పాటు ఆలస్యమైంది. హె చ్-1బీ వీసాదారులు కొందరు తాము ప్ర యాణం కొనసాగించలేమని, తిరిగి దిగిపోతామని ఒత్తిడి చేయడమే అందుకు కారణం.