calender_icon.png 31 July, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల పక్షాన టీయూడబ్ల్యూజే

30-07-2025 12:55:22 AM

  1. సమాజ అభివృద్ధి దిశగా వార్తలను రాద్దాం..

త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా హెల్త్ ఇన్సూరెన్స్

యూనియన్‌లో భారీగా చేరికలు 

రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్, జిల్లా అధ్యక్షుడు మాధవరావు

వనపర్తి, జూలై 29 ( విజయక్రాంతి ) : కొంతమంది వల్ల సమాజంలో జర్నలిస్టులు అంటే చులకన భావం ఉందని నిజాలను నిర్భయంగా సమాజ శ్రేయస్సు కోసం తపన పడే వారే జర్నలిస్టులని అలాంటి జర్నలిస్టు ల పక్షాన టి యు డబ్ల్యూ జే ( ఐజెయు ) జా తీయ, రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతుందని సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రం లోని ఓ ప్రవేట్ కార్యాలయం వద్ద విజయక్రాంతి వనపర్తి స్టాఫర్ పి. రాము ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మ ధు గౌడ్, జిల్లా అధ్యక్షుడు మాధవరావు, జి ల్లా కోశాధికారి మన్యం ల సమక్షంలో వివిధ యూనియన్లకు చెందిన పలు పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా నుండి 30 మంది జర్నలి స్టులు టి యు డబ్ల్యూ జే ( ఐజెయు ) సభ్య త్వం తీసుకున్నారు.

ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడు తూ రాష్ట్ర, జిల్లా స్థాయి లో అతి పెద్ద యూ నియన్ టి యు డబ్ల్యూ జే ( ఐజెయు ) అని అలాంటి యూనియన్ లో ఎంత పెద్ద ఎత్తు న చేరడం సంతోషం గా ఉందన్నారు.

ఈ వృత్తి లో ఎలాంటి జీత భత్యాలు రావని కా నీ తమ తమ ఇతర వ్యాపారాలను చేసుకుం టూ సమాజానికి సేవ చేయాలనీ ఈ వృత్తి మీదనే ఉన్నంతంగా ఎదగాలంటే అవివేకమని అక్రమంగా వచ్చే సంపాదన ఆ పూట కు మాత్రమే ఉంటుందని నిజాయితీ గా సంపాదించుకునే పేరు సమాజం లో శాశ్వతంగా ఉంటుందన్నారు. 

త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా హెల్త్ ఇన్సూరెన్స్ ....

ఇటీవల వనపర్తి జిల్లా కేంద్రం లో జిల్లా మహాసభలు జరిగాయని సభ విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. జిల్లా మహా సభ అని ఒక్క పిలుపునిస్తే జిల్లాలోని దాదా పు 300 లకు పైగా జర్నలిస్టులు రావడం జరిగింది. కార్యక్రమం కు విచ్చేసి న వనపర్తి ఎమ్మెల్యే తమ నియోజకవర్గం పరిధిలోని పని చేసే ప్రతి జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిం దని యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ను త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుందన్నారు.

అదేవిదంగా పాన్ గల్, వీపన గండ్ల, చిన్నంబావి జర్నలిస్టులకు మంత్రి జూపల్లి కృష్ణా రావు, కొత్త కోట, మదనాపురం జర్నలిస్టులకు మధుసూదన్ రెడ్డి, ఆత్మకూరు, అమరచింత జర్నలిస్టులకు మంత్రి వాకిటి శ్రీహరి లతో ప్రత్యేకంగా మాట్లాడి హెల్త్ ఇ న్సూరెన్స్ లతో పాటు ఇంటి స్టలం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, పలు కార్పొరేషన్ నిధులను సైతం మంజూరు చేయించే దిశగా మీ అందరి కృషి తోనే ముందుకు సాగడం జరుగుతుందన్నారు. 

అనంతరం జిల్లా అధ్యక్షులు మాధవరావు మాట్లాడుతూ ఇంత పె ద్ద ఎత్తున చేరికలు జరగడం ఆనందంగా వుందని మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా గల ఏ జర్నలిస్టుకు ఏ సమస్య వచ్చినా వారి కుటుంబంలోని సభ్యులా ఎల్లప్పుడు అండగా ఉండడంతో పాటు పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు గో పాల్, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, పట్టణ అధ్యక్షు డు తైలం అరుణ్ రాజు, రవికాంత్, తదితరులు పాల్గొన్నారు.