calender_icon.png 1 August, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారక్షణ కోసం కార్డెన్ సర్చ్

30-07-2025 12:55:18 AM

మహబూబాబాద్, జూలై 29 (విజయ క్రాంతి): ప్రజారక్షణలో భాగంగా గ్రామాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య అన్నారు. మంగళవారం ఉదయం గాంధీ పురం లో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

కార్డెన్ సర్చ్ లో భాగంగా అక్రమంగా నిలువ చేసిన రెండు క్వింటాల నల్ల బెల్లం, 20 లీటర్ల గుడుంబా, 300 లీటర్ల గుడుంబా పానకం, సరైన ధ్రువపత్రాలు లేని పదకొండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సర్కిల్లోని ఎస్‌ఐలు జితేందర్, దీపిక, కరుణాకర్, పుల్లారావు, నరేష్, రవి కిరణ్, మౌనిక, వెంకటేశ్వర్లు, వివిధ శాఖలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు.