calender_icon.png 27 July, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

26-07-2025 01:00:52 AM

  1. 109 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం

అక్రమంగా గంజాయి విక్రయాలు జరిపిన, సేవించిన కఠిన చర్యలు తప్పవు

సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి

ముస్తాబాద్, జూలై 25(విజయక్రాంతి)ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్,సూర ప్రదీప్ అను ఇద్దరు వ్యక్తులు గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుండేవారని.గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం దగ్గర ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయి అమ్ముతున్నారనే  సమాచారం మేరకు స్థానిక ఎస్త్స్ర గణేష్ ఆధ్వర్యంలో  ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసున్నట్టు సీఐ మొగిలి పేర్కొన్నారు.

తనిఖీ చేయగా వారి వద్ద నుండి 109 గ్రాముల  నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సి.ఐ మొగిలి తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా గంజాయి సేవించిన,క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత డ్రగ్స్ భారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.

గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు , నార్కోటిక్ జగిలాలతో  తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయికి సంబంధించిన సమాచారాన్ని సబంధిత పోలీస్ వారికి  అందించి గంజాయి రహిత జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.