30-10-2025 07:57:36 PM
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ
నిర్మల్ (విజయక్రాంతి): ఓ వ్యక్తిపై బండరాళ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారిపై రౌడీ సీటు కేసు నమోదు చేసినట్టు జిల్లా ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. గురువారం వివరాలను వెల్లడించారు. పట్టణంలోని మయూరి హోటల్ వద్ద సయ్యద్ ఉమర్ అలీపై రాజుల దేవి ప్రమోద్ దేవరాజ్ గొడవకు దిగి రాళ్ల దాడి చేసినట్టు తెలిపారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఆ ఇద్దరిపై రౌడీషీట్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సేవే ప్రవీణ్ కుమార్ పోలీసులు పాల్గొన్నారు.