calender_icon.png 4 May, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

03-05-2025 06:11:09 PM

చిన్నకోడూరు,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి బాలుడు, బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే... రెండు కుటుంబాలు రంగనాయక సాగర్ రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. బాలిక మిరాజ్(13), బాలుడు అర్బాస్(15) అనే ఇద్దురు పిల్లలు రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబాలో విషాదఛాయలు అలుముకున్నాయి.