calender_icon.png 5 August, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

04-08-2025 10:58:04 PM

గజ్వేల్: లారీని వెనుక నుండి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుని భార్య రంగరబోయిన సంధ్య ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా(Siddipet District) మిరుదొడ్డి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కుటుంబంతో మేడ్చల్ లోని కేఎల్ఆర్ కమాన్ వద్ద నివాసం ఉంటున్నారు. రాజ్ కుమార్ ఆదివారం 11 గంటలకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలోని తన అమ్మమ్మ గారింటి వద్ద జరుగుతున్న బోనాల పండుగకు వెళ్ళాడు.

సాయంత్రం  గజ్వేల్ మండలం అక్కారం మధిర గ్రామమైన కోనాపూర్ లోని అత్తగారింటికి వెళ్ళాడు. రాత్రి సుమారు  8 గంటలకు రాజ్ కుమార్, అతని బావమరిది రిప్పల సందీప్(19) ఇద్దరూ కలిసి TS36N0303 నెంబరు గల షిఫ్ట్ కారులో మేడ్చల్ కు భార్య సంధ్య కు ఫోన్ చేసి చెప్పారు. కోనాపూర్ నుండి బయలుదేరిన కారు రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రజ్ఞాపూర్ రాణి బ్రేక్ లైన్ లిమిటెడ్ కంపెనీ వద్ద రాజీవ్ రహదారిపై ముందు వెళ్తున్న AP01Y1669 నెంబరు గల  లారీని  వారితో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజ్ కుమార్, సందీప్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.