calender_icon.png 5 August, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో గొడవలు చేసిన వారిపై నిఘా

04-08-2025 11:00:27 PM

త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్..

సిద్దిపేట క్రైమ్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్(Inspector Vidyasagar) కోరారు. సోమవారం ఆయన స్థానిక వీపీవోతో కలిసి మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గత ఎన్నికల్లో గొడవలు చేసిన వారిపై నిఘా ఉంచామన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యువకులు గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రభుత్వం నిషేధించిన గుడుంబా, నాటు సారాయి తయారు చేయవద్దని సూచించారు. రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్య ఉంటే నేరుగా బ్యాంకు వెళ్లి అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో బెల్ట్ షాపులు నడపవద్దని హెచ్చరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అనుమానాస్పదంగా కనిపించినా డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్ఐ సూచించారు.