calender_icon.png 11 January, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొని ఇద్దరి మృతి

11-01-2026 12:00:00 AM

జనగామ దారిలో ఘటన

మహబూబాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): జనగామసూర్యాపేట జాతీయ రహదారిపై నవాబుపేట వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నెల్లుట్లలో జరిగిన ఓ వ్యక్తి మనవడి పుట్టినరోజు వేడుకలకు వనపర్తికి చెందిన దరిపల్లి నరసింహులు, మర్రి తండాకు చెందిన ధరావత్ మోతిరాం బైక్‌పై వెళ్లి వస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో  ఇద్దరు మరణించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు.