11-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): గోషామహల్ నియోజకవర్గం శివలాల్ నగర్‌లో రిలయన్స్ హైటెక్ స్కూల్‌లో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా పాఠశాల చైర్మన్ జితేందర్‌సింగ్, సంతోష్ సింగ్, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో హరిదాసుల వేషధారణలో గంగిరెద్దులతో ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్లతో పాఠశాల ప్రాంగణమంతా కలకలలాడింది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం గాలిపటాల పోటీలు, రంగోలి పోటీలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.