11 April, 2026 | 12:19 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి

11-04-2026 10:46 AM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44పై శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అంబులెన్స్‌ను వేగంగా వచ్చిన ప్రైవేట్ టూరిస్ట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ (35), పేషెంట్ సలేహ భాను (70) ప్రాణాలు కోల్పోయారు. పేషెంట్ భర్త సైఫుల్లా ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం ఆదిలాబాద్‌కు చెందిన సలేహ భాను ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. కోలుకున్న అనంతరం ఆమెను అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. TG08Y3258 నంబర్ గల ప్రైవేట్ టూరిస్ట్ బస్సు వేగంగా వచ్చి అంబులెన్స్‌ను ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న భిక్కనూర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.