calender_icon.png 24 January, 2026 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

24-01-2026 12:00:00 AM

31న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిరుద్యోగుల భారీ ధర్నా

బీసీ సంఘాల నేతలతో కలిసి వాల్ పోస్టర్ ను విడుదల చేసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 31న ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా జంపాలని నిరుద్యో గుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో  ఇందిరాపార్క్ వద్ద ఉదయం11 గంటలకు జరిగే ఈ మహాసభకు నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ నేతృత్వంలో శుక్రవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన బీసీ సంఘాల నేతలతో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రతి ఒక్క శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, జనవరి 31న వేలాదిమందితో ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ నీల  వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సీ.  రాజేందర్,  నాయకులు రాజు నేత, అంజి గౌడ్ తదితర బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు.