calender_icon.png 10 September, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో వర్క్ షాప్

04-09-2025 12:00:00 AM

ఫౌండేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ, సురక్షిత కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవగాహన

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సహకారంతో ఫౌండేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ, సురక్షిత కమ్యూనికేషన్ సిస్టమ్స్‌పై ఒకరోజు వర్క్‌షాపును బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ వై.వి. రెడ్డి వ్యవహరించగా, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్గా డాక్టర్ కె. నాగమణి మార్గనిర్దేశం చేశారు.

ఐటీ విభాగాధిపతి డాక్టర్ నితీషా శర్మ ప్రత్యేకంగా ప్రధాన అతిథిగా స్కిల్ ట్రైనర్ సుత్తోజు గిరిజా రాణి పాల్గొని విద్యార్థులకు క్రిప్టోగ్రఫీ పునాదులు, డిజిటల్ సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్ విధానాలు, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థల ప్రాముఖ్యతపై విస్తృతమైన అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని సమన్వయం చేసిన స్టూడెంట్ కోఆర్డినేటర్లు కె.వరుణ్ రాజ్, బి.దుర్గప్రసాద్, అధ్యాపక బృందం సహకరించిన అనురాగ్ యూనివర్సిటీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.