21-09-2025 04:56:44 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామానికి చెందిన బత్తుల రాంబాబు అనే గొర్రెల కాపరికి చెందిన రెండు(సుడి) గొర్రెలు ఆదివారం విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. బత్తుల రాంబాబు గ్రామ సమీపంలోని గొర్రెల మద్దతు మేతకు వెళ్ళగా సింగల్ ఫేస్ తీగలు 11 కెవికి తగలడంతో అవి అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితుడు తెలిపాడు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు 40 వేల ఉంటుందని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని బత్తుల రాంబాబు కోరాడు.