calender_icon.png 29 November, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు ‘విన్ జో’యాప్ ప్రమోటర్ల అరెస్ట్

29-11-2025 12:00:00 AM

  1. యాప్ నిర్వాహకులకు చెందిన రూ.505 కోట్ల ఆస్తుల జప్తు

ఆన్‌లైన్ ‘రియల్- మనీ గేమింగ్’పై ఈడీ ఉక్కుపాదం 

న్యూఢిల్లీ, నవంబర్ 28: రియల్ -మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపుతున్నది. దేశవ్యాప్తగా ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను ప్రమోట్ చేసే వారిని గుర్తించి, వారి ఆస్తులను జప్తు చేస్తున్నది. దీనిలో భాగంగా తా జాగా ‘విన్ జో’ యాప్ ప్రమోటర్లు పావన్ సింగ్ నందా, సౌమ్య రాథోడ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. యాప్ నిర్వాహకుల నుంచి నిందితులు భారీ ఎత్తును సొమ్ము తీసుకున్నారని, వాటిని వివిధ విదేశాలకు తరలించారనే అభియోగాలు ఉన్నాయి.

వీరి ఆర్థిక లావాదే వీలపై  ఈడీ లోతైన దర్యాప్తు చేపడుతున్నది. గడిచిన వారం రోజుల్లో ఈడీ విన్‌జో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన దాదాపు రూ.505 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిది. బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఫ్రీజ్ చేశారు. ఆ సంస్థ ఒక్క భారత్‌లోనే కాకుండా బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ వంటి దేశాల్లోనూ ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.