28-11-2025 12:13:27 AM
ప్రపంచ వేదికపై తెలుగు నాయకత్వానికి దక్కిన గౌరవం
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అం దించే అత్యంత అరుదైన ప్రతిష్ఠాత్మక గౌరవాలలో ఒకటైన ‘యూఏఈ గోల్డెన్ వీసా’ను ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మం డలి చైర్మన్ సందీప్ మక్తాల అందుకున్నారు. రాస్ అల్ ఖైమా రాజభవనం మద్దతుతో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు టెక్ లీడర్ సందీప్ మక్తాల కావ డం విశేషం.
ఇది కేవలం ఒక వీసా కాదు, సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ శాంతికి ఆయన చేస్తున్న అద్భుతమైన సేవలకు ల భించిన అంతర్జాతీయ గుర్తింపు. యూఏఈ ప్రభుత్వం అన్ని వీసా సంబంధిత ఖర్చులను సంపూర్ణంగా భరించడం ద్వారా, మక్తాలా గారి ప్రపంచ స్థాయి సేవలను గుర్తించింది. 2019లో ప్రవేశపెట్టబడిన యూఏఈ గోల్డెన్ వీసా, అత్యం త ప్రతిష్ఠాత్మకమైన దీర్ఘకాల గౌరవాలలో ఒకటిగా పరిగ ణిం చబడుతుంది.
ప్రపంచ స్థాయి ప్రభావం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఈ గుర్తింపు అందజేస్తారు. షారుక్‌ఖాన్, సో ను సూద్, ఎంఏ యూసుఫ్ అలీ వంటి కొద్దిమంది అత్యంత గౌరవనీయ భారతీయులు గతం లో ఈ గౌరవాన్ని స్వీకరించారు. గౌరవానికి ప్రతీకగా, యూఏఈ మక్తాలా కుటుం బానికి మొత్తం గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఇందులో ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఉండటం విశేషం. టె క్నాలజీ, ఆవిష్కరణల దౌత్యం, వ్యవస్థాపకత, ప్రపంచ శాంతి చొరవలకార్యక్రమాల విభాగాల్లో మక్తాలా చేస్తున్న విశిష్ట సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) చైర్మన్‌గా 63 దేశాలలోని 2,843 కంపెనీలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఐటీఏ గ్లోబల్ ప్రెసిడెంట్గా సేవలందిస్తూ, టీ కన్సల్ట్, తన మధ్యప్రాచ్య విస్తరణ మిషన్ ఎక్స్ పాన్ట్‌ఎంఈ ద్వారా సరిహద్దులను దాటి ఇన్నోవే షన్కు తోడ్పడ్డారు. నోబెల్ పురస్కార గ్రహీతలు మద్దతు తెలిపిన ఆయన సైబర్ సత్యా గ్రహ పీస్ మిషన్ నైతిక సాంకేతికత, శాంతి నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావం వెలుగులోకి తెచ్చింది.