calender_icon.png 28 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత

28-11-2025 12:12:09 AM

ఎస్పీ డాక్టర్ శబరీష్ 

మహబూబాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 163 బి.ఎన్.ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకా రం, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అశాంతి, అవకతవకలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నామినేషన్లు స్వీకరించే ప్రతి కేంద్రం వద్ద డి.ఎస్.పి, సీఐ, ఎస్ ఐ లు ప్రత్యక్ష పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.

అనుమతి పొందిన అభ్యర్థులు, వారి సహాయకులకు మాత్రమే ప్రవే శం ఉంటుందని, జనసమ్మర్దం, అనవసర గుంపులు, అతి ఉత్సాహ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికల షె డ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమలులోకి వచ్చినట్టు ఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీ లు, అభ్యర్థులు, కార్యకర్తలు చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

 చెక్పోస్టుల ఏర్పాటు, వాహన తనిఖీలు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో ప్రధాన రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమ నగదు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్ళేటపుడు సంబంధిత రసీదు తప్పనిసరి వెంట ఉంచుకోవాలని చెప్పారు.

 ప్రశాంత ఎన్నికల నిర్వాహనకు చర్యలు

గత ఎన్నికల్లో సమస్యలకు కారణమైన వ్యక్తులపై రెవెన్యూ అధికారుల సమక్షంలో బైండ్‌ఓవర్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న అన్ని లైసెన్స్ ఆయుధాలు తాత్కాలికంగా స్వాధీనం చేయాలని సూచించారు. ట్రబుల్ మేకర్లు, రౌడీషీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు.

 పర్యవేక్షణ పెట్రోలింగ్: 

మండలాల వారీగా ప్రత్యేక నిఘా బృం దాలు ఏర్పాటు చేశామని, 24/7 పెట్రోలింగ్, ప్రత్యేక అవసరాలు కలిగిన చోట డ్రోన్లతో నిఘా కూడా నిర్వహిస్తామని చెప్పా రు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే డయల్ 100, జిల్లా కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియా నిఘా

ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, ద్వేషపూరిత కా మెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, రూమ ర్లు పంచే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలే వినియోగిం చాలని, లౌడ్స్పీకర్ వాడకానికి ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ర్యాలీలు కుల మత విభేదాలు రేకెత్తించేలా ఉండకూడదన్నారు..నామినేన్ కేంద్రానికి అభ్యర్థి తో పాటు అనుమతి పొందిన సహాయకులకే ప్రవేశం ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించగలరని ఎస్పీ ప్రజలకు, అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.