calender_icon.png 20 September, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉల్లాస్’ విజయవంతం చేయాలి

20-09-2025 12:07:33 AM

వెల్దండ, సెప్టెంబర్ 19: స్వయం సహాయక సంఘాల్లో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం కోసం అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు, వివోఏలకు, వెలుగు సీసీలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధికారి రమేష్ మాట్లాడుతూ నిరక్షరాస్యులకు విద్యను అందించేందుకు రూ పొందించిన లాస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించే విధంగా విద్యను అందించి ప్రతి ఒక్కరిని విద్యావంతుగా తీర్చిదిద్దాలని సూచించారు. సమాజంలో మండల విద్యాధికారి చంద్రుడు ఏపిఎం శ్రీదేవి ఆర్పీలు రాఘవేందర్ రాజు వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివిధ గ్రామాల విఏవోలు పాల్గొన్నారు.