20-09-2025 12:07:26 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 26న రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి ట్రస్ట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు నాగార్తిచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించామని ఈ సందర్భంగా ట్రస్ట్ కు సంబంధించిన జమ, ఖర్చులు వివరించడం జరిగిందని తెలిపారు. ఇంతవరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించామని ఆయన తెలిపారు.
రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ట్రస్టులో శాశ్వత సభ్యులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ సర్వసభ్య సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఈ సమావేశం లక్ష్మీదేవి గార్డెన్లో జరగనున్నని తెలిపారు. ఈ సమావేశంలో రాబోవు రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టనున్న భవన నిర్మాణ విషయంపై సమగ్రంగా సభ్యుల సమక్షంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగౌరవ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు మినుకురి రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ రెడ్డి, కోశాధికారి కుంటసంతోష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.