16-09-2025 07:47:00 PM
మందమర్రి (విజయక్రాంతి): దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను భరించలేక వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దీపక్ నగర్‌లో నివాసముండే పిట్టల లక్ష్మీ(65) తన ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గత కొద్ది రోజులుగా కిడ్నీకి సంబంధించిన వ్యాదితో పాటు, బిపి, షుగర్, వంటి వ్యాధులతో బాధపడుతుందని మందులు వాడినప్పటికీ వ్యాధి తగ్గకపోగా, గతంలో తన పెద్ద కుమారుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందాడని, ఒకవైపు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మరోవైపు కొడుకు మరణంతో మానసిక వేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.